16,500పైన నిఫ్టి ప్రారంభం
సింగపూర్ నిఫ్టి కన్నా మెరుగైన లాభాలతో నిఫ్టి ఓపెనైంది. ఆరంభంలోనే 16548 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 16543 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 44 షేర్లు లాభాలతో ట్రేడవుతుండగా, ఆరు షేర్లు నష్టాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. అత్యంత కీలకమైన స్థాయి 36000 వద్ద నిఫ్టి బ్యాంక్ ట్రేడవుతోంది. నిఫ్టిలో ర్యాలీ కొనసాగుతుందని..అయితే మార్కెట్ పడినపుడు మాత్రమే కొనుగోలు చేయాలని ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు సుదర్శన్ సుఖాని అన్నారు. ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్ రెండు శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇవాళ ఐటీ షేర్లు వెలుగులో ఉన్నాయి. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో చాలా వరకు ఇవే ఉన్నాయి. ఎం అండ్ ఎం టాప్ గెయినర్‌గా నిలిచింది. ఫలితాల తరవాత జొమాటొ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇవాళ రూ. 64ను దాటింది. మిడ్ క్యాప్‌లో చాలా ఐటీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బ్యాంకు షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ గెయినర్‌గా ఉంది. ఇక ఎల్ఐసీ బోర్డు ఇవాళ ఫలితాల పరిశీలనకు భేటీ అవుతోంది. డివిడెండ్ ప్రకటిస్తుందని మార్కెట్ ఆశిస్తోంది. షేర్రూ. 832 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 10 లాభంతో ట్రేడవుతోంది.