NIFTY TRADE: ఆల్గో గేమ్ ఫలించేనా?
నిఫ్టి అధిక స్థాయిలో కదలాడుతున్న తీరు చూస్తుంటే ఆల్గో ట్రేడింగ్ కూడా గేమ్‌లా మారింది. కేవలం టెక్నికల్స్ ఆధారంగా సాగుతున్న ఈ ట్రేడింగ్ ఇపుడు ఇన్వెస్టర్లను కూడా అయోమయంలో పడేస్తోంది. ఒక్కోసారి స్టాప్‌లాస్ పనిచేస్తోంది… మరోసారి భారీ లాభాలు చేతికి అందకుండా పోతున్నాయి. ఆల్గోలో కూడా కనిష్ఠ, గరిష్ఠ స్థాయిలో భారీ తేడా ఉండటంతో ఇన్వెస్టర్లు అయోమయంలో పడుతున్నారు. టార్గెట్ల కన్నా స్టాప్లాస్లనే నిఫ్టి చాలా సార్లు టచ్ చేస్తోంది. ఇవాళ కూడా ఆల్గో లెవల్స్‌లో చాలా వ్యత్యాసం ఉంది. 17700 ప్రాంతంలో కొనుగోలు సిగ్నల్, 17900 ప్రాంతంలో అమ్మకాల సిగ్నల్ ఇస్తున్నారు. నిన్న వీక్లీ డెరివేటివ్స్ కారణంగా నిఫ్టిలో భారీ షార్ట్ కవరింగ్ వచ్చింది. మరి ఇవాళ నిఫ్టి డే టార్గెట్ 17,920 ప్రాంతంలో ఉంది. ఇపుడు డే ట్రేడింగ్ కంటే పొజిషనల్ ట్రేడర్స్ భారీగా లాభం పొందుతున్నారు. ఇవాళ కూడా నిఫ్టి క్షీణించి 17,720 ప్రాంతానికి వస్తే కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు. నిఫ్టి క్రితం ముగింపు 17,822. నిఫ్టి పడితే 17,750 ప్రాంతానికి వస్తే కొనే అంశాన్ని పరిశీలించవచ్చు. పొజిషనల్ ట్రేడర్స్ తమ పొజిషన్స్‌ను కొనసాగింవచ్చు. అయితే స్ట్రిక్ట్ స్టాప్‌లాస్ పెట్టుకోవడం మంచిది. నిఫ్టిలో ట్రేడ్‌కు భారీ పెట్టుబడి అవసరం కావడం, ఆప్షన్స్ ట్రేడింగ్‌లో రిస్క్ పెరుగుతోంది. నిఫ్టి నిలదొక్కుకునేవరకు చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది. మంచి షేర్ల కోసం అన్వేషించడం మంచిది.