For Money

Business News

ఓపెనింగ్‌లోనే… 18022ని తాకిన నిఫ్టి

ఇవాళ ఆల్గో ట్రేడింగ్‌ ప్రకారం నిఫ్టికి 18022 అత్యంత కీలకం. ఇవాళ ఉదయం 18129 వద్ద ప్రారంభమైన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 18,022ని తాకింది. వెంటనే అక్కడి నుంచి మద్దతు లభించడంతో ప్రస్తుతం 18072 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 40 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. పెద్ద ఇన్వెస్టర్లు తమ పొజిషన్స్‌ను సర్దుకోవడానికి ఈ ట్రేడింగ్‌ అని చెప్పొచ్చు. ఇక అసలు ట్రేడింగ్‌ మాత్రం 9.45 గంటలకు ప్రారంభం కానుంది. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఈ ఒత్తిడి మిడ్‌ క్యాప్‌ షేర్లలో అధికంగా ఉంది. బ్యాంక్‌ నిఫ్టి కూడా ఒక మోస్తరు నష్టాలతో ఉంది. నిఫ్టిలో 31 షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిన్న ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించిన బజాజ్‌ ఫైనాన్స్‌ 2.4 శాతం లాభపడగా, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు పెరగడంతో ఓఎన్‌జీసీ షేర్‌ 2.5 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇక పతనంలో ఐటీ షేర్లు ముందున్నాయి. ఇన్ఫోసిస్‌, విప్రో షేర్లు టాప్‌ లూజర్స్‌లో ముందున్నాయి. ఇక వొడాఫోన్‌ ఐడియా షేర్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. అలాగే గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ఇవాళ రెండు శాతం నష్టంతో ట్రేడవుతోంది.