For Money

Business News

పొపైజ్‌ రెస్టారెంట్లు షురూ

అమెరికాలో పేరొందిన చికెన్‌ బ్రాండ్ పొపైజ్‌ను జూబ్లియంట్‌ ఫుడ్‌ మన దేశంలో ప్రారంభించింది. మన దేశంలో డొమినోజ్‌ పిజ్జా, డంకిన్‌ డొనట్స్‌ను ఈ కంపెనీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అమెరికాలో 45 ఏళ్ళుగా పేరొందిన పొపైజ్‌ బ్రాండ్‌ ఉత్పత్తులను మన దేశంలో మార్కెట్‌ చేసేందుకు జూబ్లియంట్‌ గత ఏడాది మార్చిలో అమెరికా కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం మేరకు దేశంలో పొపైజ్‌ రెస్టారెంట్లను ఆపరేట్‌ చేసే హక్కులను పొందింది. మన దేశంతో పాటు బంగ్లాదేశ్‌, నేపాల్, భూటాన్‌లలో కూడా వీటిని జూబ్లియంట్‌ ప్రారంభించనుంది. 1972లో నెలకొల్పిన పొపైజ్‌ గత 45 ఏళ్ళుగా చికెన్‌ మార్కెట్‌ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.