17,800ని తాకిన నిఫ్టి
నిఫ్టి ఇవాళ కూడా ఆల్గో లెవల్స్‌కు అనుగుణంగా ట్రేడవుతోంది. ఉదయం 17,943ని తాకిన నిఫ్టి తరవాత క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. కొద్ది సేపటి క్రితం 17,802ని తాకింది. మిడ్ సెషన్లోగానే ఇవాళ్టి ప్రధాన మద్దతు స్థాయిని తాకింది. ప్రస్తుతం 12 పాయింట్ల నష్టంతో 17,841 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి లాభాల్లో ఉండగా, మిడ్ క్యాప్ సూచీ కూడా నష్టాల్లోకి వచ్చేసింది. ముఖ్యంగా ఐటీ, పార్మా షేర్లలో భారీ ఒత్తిడి వస్తోంది. ఒకదశలో ఐటీ సూచీ రెండు శాతం క్షీణించింది. ఆటో షేర్లు ఇవాళ టాప్ గేర్‌లో ఉన్నాయి. నిఫ్టి టాప్ ఫైవ్‌లో టాటా మోటార్స్, మారుతీ, హీరోమోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి.