నిఫ్టి: అమ్మినవాడు అదృష్టవంతుడు
కేవలం ఒక్క బ్యాంక్ నిఫ్టిని కాపాడుతుందా? పైగా మూడు శాతం లాభంతో ప్రారంభమైనా, ఆ బ్యాంక్ కూడా నష్టాల్లో ముగియడంతో బ్యాంక్ నిఫ్టి ఏకంగా 0.9 శాతం నష్టపోయింది. నిఫ్టి లాభాల్లో కోత పెట్టింది. ఉదయం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హంగామాతో మొదలైన ఉత్సాహం మిడ్‌సెషన్ కల్లా కరిగిపోయింది. ఇన్వెస్టర్లు ఆ కౌంటర్లలో లాభాలు స్వీకరించడంతో లాభాల నుంచి నష్టాల్లో ముగిసింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. నిఫ్టి ఆల్గో ట్రేడింగ్ స్థాయిలకే పరిమితమైంది. 16700ను తాకిన నిఫ్టి అక్కడి నుంచి ఏకంగా 16,535 దాకా క్షీణించింది. అంటే 165 పాయింట్ల లాభం.. షార్ట్ చేసినవారికి. గతకొన్ని రోజులుగా నిఫ్టిని అధిక స్థాయిలో షార్ట్ చేసినవారికి లాభాలు వస్తూనే ఉన్నాయి. నిఫ్టి లాభాల్లో ముగిసినా… పడిన తరవాత జరుగుతోంది. ఇవాళ నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 46 పాయింట్ల నష్టంతో 16,568 పాయింట్ల వద్ద ముగిసింది. చిత్రంగా మిడ్ క్యాప్ సూచీ స్థిరంగా ముగిసింది. వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా నిన్న చివరల్లో భారీగా పెరిగిన షేర్లు… ఇవాళ ఉదయం గరిష్ఠ స్థాయికి వెళ్ళాయి. తరవాత లాభాల స్వీకరణ కారణంగా భారీగా క్షీణించాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఐషర్ మోటార్స్ 2,582.65 2.66
అల్ట్రాటెక్ సిమెంట్ 7,590.00 2.44
బజాజ్ ఫిన్ సర్వ్ 6,544.00 2.09
అదానీ పోర్ట్స్ 704.50 1.71
గ్రాసిం 1,505.00 1.62
నిఫ్టి టాప్ లూజర్స్
కొటక్ బ్యాంక్ 1,747.00 -2.31
హిందాల్కో 426.55 -2.30
ఐసీఐసీఐ బ్యాంక్ 686.90 -2.04
ఎస్‌బీఐ లైఫ్ 1,114.00 -1.83
టాటా మోటార్స్ 293.15 -1.53