For Money

Business News

16,000ని టచ్‌ చేసిన నిఫ్టి

నిన్నలాగే ఇవాళ కూడా మిడ్‌ సెషన్‌ కల్లా నిఫ్టి 16000ని దాటింది. ఇవాళ నిన్నటికి భిన్నంగా యూరో మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభం కావడంతో మన మార్కెట్లలో లాభాలు కొనసాగుతున్నాయి. యూరో మార్కెట్లు ఒకటిన్నర శాతం నుంచి రెండు శాతం వరకు లాభంతో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాలు దాదాపు పోయినట్లే. ఏ క్షణంలోనైనా గ్రీన్‌లోకి వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఉదయం 15800ని తాకిన నిఫ్టి ఇపుడు 15957 పాయింట్ల వద్ద ట్రేడువుతోంది. నిఫ్టిలో 39 షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ ఇవాళ రికార్డు స్థాయిలో 4 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. ఇతర ప్రధాన సూచీలు ఒకశాతం నుంచి ఒకటిన్నర శాతం వరకు లాభంతో ట్రేడవుతున్నాయి. ఇదే ట్రెండ్‌ కొనసాగే పక్షంలో నిఫ్టి 16068ని తాకుతుందేమో చూడాలి. లేదా కనీసం 16051ని తాకే అవకాశం ఉందని అనలిస్టులు అంటున్నారు.