For Money

Business News

నిఫ్టికి 17,380 కీలకం

అమెరికా మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్ల ఉత్సాహంతో మన నిఫ్టి కూడా ఓపెనింగ్‌లోనే తొలి ప్రతిఘటన స్థాయిని తాకనుంది. రేపు మార్చినెల వీక్లీ, మంత్రి డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు నిన్న ఫ్యూచర్స్‌ భారీగా కొనుగోలు చేశారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న చర్చలకు సంబంధించి వస్తున్న వార్తలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. నిఫ్టి ఇవాళ కూడా 150 పాయింట్ల లాభంతో ప్రారంభం కానుంది. మరి ఈ స్థాయిలోనే తొలి ప్రతిఘటన ఉంది. మరి ఈ స్థాయిని దాటి ముందుకు వెళుతుందా లేదా ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తారా అన్నది చూడాలి. శాంతి చర్చల నుంచి పాజిటివ్‌ న్యూస్‌ వస్తే మాత్రం నిఫ్టి 17400ని దాటే అవకాశముంది. కాని డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ దృష్ట్యా మార్కెట్‌లో హెచ్చుతగ్గులకు ఛాన్స్‌ ఉంది. ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌ ఇవి… దిగువ స్థాయిలో నిఫ్టికి గట్టి మద్దతు ఉంది. భారీ పతనం ఉండదన్నమాట. నిన్నటి ముగింపు ఇవాళ కీలకం. ఆ స్థాయి దిగువకు వెళితే అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంటుంది. లేదంటే రోజంతా గ్రీన్‌లోనే ఉండే అవకాశముంది.

అప్‌ బ్రేకౌట్‌ 17410
రెండో ప్రతిఘటన 17389
తొలి ప్రతిఘటన 17375
నిఫ్టికి కీలకం 17297
తొలి మద్దతు 17275
రెండో మద్దతు 17261
డౌన్‌ బ్రేకౌట్‌ 17241