ఇవాళ నిఫ్టి దూకుడు ఖాయం
శుక్రవారం అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. డాలర్ స్పీడుకు బ్రేక్ పడింది. ఉద్దీపన ప్యాకేజీని క్రమంగా ఆపుతారన్న వార్తలను మార్కెట్ డిస్కౌంట్ చేసిందని విశ్లేషకులు అంటున్నారు. శుక్రవారం అమెరికా మార్కెట్లలో నాస్‌డాక్ 1.2 శాతం లాభంతో ముగిసింది. ఎస్ అండ్ పీ 500, డౌ జోన్స్ 0.65 శాతం లాభంతో ముగిసింది. దీంతో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో భారీ ర్యాలీ వచ్చింది. దాదాపు అన్ని మార్కెట్లు కనీసం ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ 1.7 శాతం లాభపడగా, హాంగ్‌సెంగ్, తైవాన్ మార్కెట్లు రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్లు కూడా 1 శాతం నుంచి 1.5 శాతం లాభంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి కూడా 177 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. అంటే నిఫ్టి కూడా ఒక శాతంపైగా లాభంతో ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.