స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
గత శుక్రవారం నాస్‌డాక్ నష్టాల్లో ముగిసినా.. ఇతర సూచీలు గ్రీన్‌లో ముగిశాయి.ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్ మార్కెట్లకు సెలవు. గత కొన్ని రోజులుగా నష్టాల్లో ఉన్న చైనా మార్కెట్లు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ కూడా ఒకశాతంపైగా లాభంతో ఉంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రయాణాలపై చైనా ఆంక్షలు విధించింది. దీంతో క్రూడ్ ధరలు తగ్గాయి. సింగపూర్ నిఫ్టి ఉదయం నష్టాల్లో ఉన్నాయి. ఇపుడు నష్టాలు పూడ్చుకుని స్థిరంగా ఉంది. నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.