For Money

Business News

అమెరికా డల్‌… ఆసియా ఓకే.. మరి నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. మూడు ప్రధాన సూచీల్లో పెద్ద మార్పల్లేవ్‌. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతకం చేయడంతో అమెరికా ఫ్యూచర్స్‌ స్వల్పంగా గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఇటీవల వరుసగా నష్టాల్లో ట్రేడైన మార్కెట్లు ఇపుడు గ్రీన్‌లో ఉన్నాయి. న్యూజిల్యాండ్‌, ఆస్ట్రేలియా మార్కెట్లు దాదాపు ఒక శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అవి తప్ప మిగిలిన మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ కేవలం 0.26 శాతం లాభంలో ఉన్నాయి. చాలా రోజుల తరవాత హాంగ్‌సెంగ్‌, చైనా మార్కెట్లు అర శాతం లాభంతో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి 50 పాయింట్లు గ్రీన్‌లో ఉంది. సో… నిఫ్టి కూడా గ్రీన్‌లో ప్రారంభం కానుంది.