For Money

Business News

లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

వడ్డీ రేట్లను ఇప్పట్లో పెంచమని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ స్పష్టం చేయడంతో డాలర్‌ మళ్ళీ బలహీనపడింది. ఫలితంగా శుక్రవారం యూరో, అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ ఒకటిన్నర శాతంపైగా లాభపడింది. అయితే ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో ఇదే ఉత్సాహం కన్పించడం లేదు. ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నా… ఏ మార్కెట్‌ కూడా కనీసం అర శాతం కూడా లాభంతో ట్రేడవలేదు. జపాన్‌, నిక్కీ సూచీలు కూడా అర శాతంలోపే లాభంతో ట్రేడవుతున్నాయి. చైనా A50 నష్టాల్లో ఉంది.న్యూజిల్యాండ్, తైవాన్‌ మార్కెట్లు అర శాతంపైన ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ నిఫ్టి 90 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. మరి నిఫ్టి ఇదే స్థాయిలో లాభాలతో ఓపెన్‌ అవుతుందా అనేది చూడాలి. ఒక మోస్తరు లాభాలతో మాత్రం ప్రారంభం కానుంది.