For Money

Business News

లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

నిన్న యూరో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడైనా… రాత్రి స్వల్పంగా కోలుకున్నాయి. నాస్‌డాక్‌ ఒక శాతంపైగా నష్టంతో ముగియడానికి ప్రధాన కారణం చైనా కంపెనీల పతనం. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చిత్రంగా నిన్నటి దాకా నష్టాల్లో ఉన్న సూచీలు ఇవాళ గ్రీన్లోకి రాగా, నిన్నటి దాకా గ్రీన్‌లో ఉన్న సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా జపాన్‌ నిక్కీ ఒక శాతంపైగా నష్టంతో ఉంది. చైనా, హాంగ్‌కాంగ్‌ గ్రీన్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ ఒక శాతం లాభంతో ఉంది. సింగపూర్‌ నిఫ్టి 40 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి కూడా లాభాల్లో ప్రారంభమయ్యే అవకాశముంది. మరి ఇవాళ్టి నిఫ్టి ట్రేడ్‌ వ్యూహం కోసం నిఫ్టి ట్రేడ్‌ వార్త చూడగలరు.