లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
శుక్రవారం యూరో స్టాక్స్ 50, వాల్‌స్ట్రీట్ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా వాల్‌స్ట్రీట్‌లో నాస్ డాక్ 0.7 శాతం నష్టపోగా, మిగిలిన సూచీలు అర శాతం వరకు నష్టాలతో ముగిశాయి. అయితే ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్ అర శాతం లాభంతో ఉన్నాయి. అంటే నష్టాలు కవర్ అయినట్లే . అమెరికా మార్కెట్ల పరిస్థితి ఇలా ఉండగా, ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. చైనా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ నష్టాల్లో నామ మాత్రంగా ఉన్నాయి. అయితే జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 1.6 శాతం లాభంతో ఉంది. సింగపూర్ నిఫ్టి కూడా 119 పాయింట్ల లాభంతో ఉంది. అంటే 0.75 శాతం లాభంతో ఉంది. మరి నిఫ్టి ఇదే స్థాయిలను లెక్కిస్తే ఓపెనింగ్‌లోనే 15,880 ప్రాంతంలో ఓపెన్ కావాలి. శుక్రవారం సింగపూర్ నిఫ్టి నష్టాల్లో ఉన్నా నిఫ్టి కేర్ చేయలేదు… లాభాల్లో ప్రారంభమైంది. ఇవాళ కూడా నిఫ్టి ఆకర్షణీయ లాభంతో ప్రారంభం కానుంది.