For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

ప్రపంచ మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఆరంభ లాభాలు తగ్గినా అన్ని సూచీలు దాదాపు ఒక శాతం లాభంతో ముగిశాయి. డాలర్‌ బలంగా ఉంటోంది. పడిన వెంటనే కోలుకుంటోంది. మరోవైపు క్రూడ్‌ ఆయిల్‌ ఏమాత్రం తగ్గడం లేదు. బుధవారం భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చినా… రాత్రి లాభాల్లో ముగిసింది. ఇపుడు కూడా లాభాల్లో ఉంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. సెలవుల తరవాత చైనా మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఫుట్సి చైనా A50, డౌజోన్స్‌ షాంఘై, షెంజెన్‌ కాంపొజిట్‌ సూచీలు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్‌ డల్‌గా ఉంది. లాభాల్లో ఉన్నా నామ మాత్రమే. చైనా మార్కెట్‌ పతనాన్ని ఆహ్వానించిన సింగపూర్‌ నిఫ్టి ఇపుడు నామమాత్రపు లాభాల్లో ట్రేడవుతోంది. ఈ లెక్కన చూస్తే నిఫ్టి కూడా స్వల్ప లేదా స్థిరంగా ప్రారంభం కావొచ్చు. ప్రపంచ మార్కెట్లు పతనమైనపుడు పెరిగిన మన మార్కెట్లు ఇపుడు డల్‌గా ఉంటున్నాయి.