For Money

Business News

ఫ్లాట్‌గా ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. సూచీల్లో పెద్ద మార్పు లేదు. అంతకుముందు యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అయితే కీలక మార్కెట్లన్నీ ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా జపాన్‌ నిక్కీ, హాంగ్‌సెంగ్ సూచీలు అరశాతంపైగా లాభంతో ఉన్నాయి. చైనా మార్కెట్లు పరవాలేదు. కరెన్సీ, క్రూడ్‌ మార్కెట్లలో పెద్దగా మార్పు లేదు. సౌదీ అరేబియా ఆసియా దేశాలకు తక్కువ ధరకు క్రూడ్‌ అమ్మినా… క్రూడ్‌ ధరలు అధికస్థాయిలో ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి క్రితం ముగింపు స్థాయిలోనే ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.