For Money

Business News

స్వల్ప లాభాల్లో SGX నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లన్నీ నిస్తేజంగా ఉన్నాయి. అమెరికా మిశ్రమంగా ఉంది. నాస్‌డాక్‌ రాత్రి ఒకశాతంపైగా నష్టపోయినా.. డౌజోన్స్‌ గ్రీన్‌లో ముగిసింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ స్వల్ప నష్టంతో ముగిసింది. డాలర్‌ ఇండెక్స్‌ 104పైనే ఉంది. ఈ స్థాయిలో కూడా బ్రెంట్‌ క్రూడ్‌ 115 డాలర్ల వైపు పరుగులు తీస్తోంది. ఇక ఆసియా మార్కెట్లు గ్రీన్లో ఉన్నా.. హాంగ్‌ సెంగ్‌ ఒక్కటే 1.92 శాతం లాభంతో ఉంది. చైనా స్వల్ప నష్టాల్లో ఉండగా, జపాన్‌ నిక్కీతో సహా ఇతర మార్కెట్లు గ్రీన్లో ఉన్నా… లాభాలు అర శాతం కన్నా తక్కువే. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 45 పాయింట్ల లాభంతో ఉంది. మరి మన మార్కెట్‌ ఓపెనింగ్‌ సమయానికి ఈ లాభాలు ఉంటాయా అన్నది చూడాలి. ఆసియా ట్రెండ్‌ చూస్తుంటే మన మార్కెట్లు కూడా స్థిరంగా ప్రారంభం కావొచ్చు.