కన్ఫ్యూజన్లో సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికాలో దాదాపు రక్తపాతమే. ఐటీ, టెక్ షేర్లతో పాటు డౌజోన్స్ కూడా భారీగా క్షీణించింది. నిన్న మార్కెట్ కొనసాగే కొద్దీ నష్టాలు పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధ భయాలు.. వడ్డీ రేట్లపై రకరకాల కామెంట్లతో రాత్రి నాస్డాక్ దాదాపు మూడు శాతం నష్టపోయింది. ఇక ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 2 శాతంపైగా నష్టపోయింది. ఇక డౌజోన్స్ 1.8 శాతం క్షీణించింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు రెడ్‌లో ఉన్నాయి. కాకపోతే అమెరికా స్థాయి నష్టాలు కాదు. స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం గురించి అమెరికా గంటకో మాట వస్తోంది. మొత్తం మార్కెట్లను అయోమయంలో పడేస్తున్నాయి. ప్రభుత్వ వర్గాలు కూడా తడవకో మాట చెప్పడంతో ఇన్వెస్టర్లు కన్ఫ్యూజన్లో ఉన్నారు. చైనా మార్కెట్లు వీటిని పట్టించుకోవడం లేదు. స్వల్ప నష్టాలతో ఉన్నాయి. కాని హాంగ్‌సెంగ్, జపాన్ నిక్కీలు అర శాతం నష్టంతో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి నష్టాల్లో.. తరవాత స్థిరంగా… తరవాత లాభాల్లో ఉంది. అమెరికా ఫ్యూచర్స్గ్రీన్లో ఉన్నా… చాలా స్వల్పమే. కాబట్టి నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు.