For Money

Business News

నేస్లే కొనాలా? వొద్దా?

నెస్లే ఇండియా నిన్న ప్రకటించిన ఫలితాలు బ్రోకరేజి సంస్థలు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ షేర్‌ టార్గెట్‌ను కూడా మార్చాయి. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ నొమురా ఈ షేర్‌ను కొనుగోలు చేయమని రెకమెండ్‌ చేస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుతం ధర రూ.18090 కాగా, టార్గెట్‌రూ. 21150గా పేర్కొంది. అనిశ్చితిలో కూడా కంపెనీ స్థిర వృద్ధి సాధించిందని నొమురా అంటోంది. వ్యయ నియంత్రణకు అధిక ప్రాధాన్యం ఇస్తూ… ధరలు పెంచకుండా కంపెనీ చర్యలు తీసుకొంటోందని నొమురా అంటోంది.
మోర్గాన్‌ స్టాన్లీ మాత్రం నెస్లేకు సెల్‌ రేటింగ్‌ ఇచ్చింది. ఈ షేర్‌ ధర రూ. 15712కు పడిపోయే అవకాశముందని పేర్కొంది. కంపెనీ పనితీరు ఊహించిన దానికన్నా బాగున్నా… వృద్ధి స్పీడు మందగించిందని, మార్జిన్స్‌ ఒత్తిడి అధికంగా ఉందని పేర్కొంది. క్రెడిట్‌ సూసె మాత్రం న్యూట్రల్‌ అని రెకమెండ్‌ చేసింది. ఈ సంస్థ ఇచ్చిన టార్గెట్‌ రూ.20,000. నెస్లే ఇండియాను కొనుగోలు చేయమని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సిఫారసు చేసింది.ఈ సంస్థ ఇచ్చిన టార్గెట్‌ రూ.20,000. సమీప భవిష్యత్తులో కొన్ని సవాళ్ళు ఉన్నా.. కంపెనీ స్థిరంగా రాణిస్తోందని పేర్కొంది. నెస్లేను అమ్మాలని అంటోంది సీఎల్‌ఎస్‌ఏ. ఈ సంస్థ ఇస్తున్న టార్గెట్‌ రూ. 17,370. జెఫెరీస్‌ రీసెర్చి సంస్థ నెస్లేను మీ పోర్టుఫోలియాలో కొనసాగించమని అంటోంది. ఈ సంస్థ ఇచ్చిన టార్గెట్‌ రూ.18600. సో.. మెజారిటీ బ్రోకరేజీ సంస్థలు నెస్లేను కొనుగోలు చేయమని అంటున్నాయి. మార్కెట్‌ వీక్‌గా ఉంది… కాబట్టి పడినపుడు కొనడం బెటర్‌.