నష్టాల్లో ఆసియా.. మరి నిఫ్టి?
చాలా రోజుల తరవాత రాత్రి వాల్‌స్ట్రీట్‌లో నాస్‌డాక్ గ్రీన్‌లో ముగిసింది. భారీ నష్టాలత తరవాత కోలుకుంది. ఎస్ అండ్ పీ 500, డౌజోన్స్ సూచీల్లో పెద్ద మార్పు లేదు. ఉదయం నుంచి ఆసియాలో కూడా ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. భారీ నష్టాల తరవాత నిక్కీ ఇవాళ లాభాల్లో ఉంది. హాంగ్‌సెంగ్‌లో మాత్రం నష్టాలు కొనసాగుతున్నాయి. కాని నష్టాలు స్వల్పమే. చైనా మార్కెట్లు కూడా ఇవాళ రెడ్‌లో ఉన్నాయి. దాదాపు గ్రీన్‌లో ఉన్న మార్కెట్లు చాలా తక్కువ. కాని లాభనష్టాలు నామమాత్రంగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి కూడా స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.