హాంగ్‌కాంగ్ మార్కెట్లు డౌన్
రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అన్ని సూచీలు 0.3 శాతం లాభంతో క్లోజయ్యయాయి. డాలర్ స్థిరంగా ఉంది. ఉదయం నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు ఒకటిన్నర శాతం తగ్గాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో ప్రధాన మార్కెట్లన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ అరశాతం దాకా నష్టంతో ఉంది. ముఖ్యంగా హాంగ్‌సెంగ్ ఇవాళ కూడా ఒక శాతం నష్టంతో ట్రేడ్ కావడం చూస్తుంటే.. మన మార్కెట్‌లో వీక్‌నెస్ కన్పించవచ్చు. చైనా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి..కాని నామ మాత్రపు నష్టాలే. ప్రస్తుతం సింగపూర్ నిఫ్టి 30 పాయింట్ల లాభంతో ఉంది. ఈ లెక్కన చూస్తుంటే నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు.