MID SESSION: 17,700 వద్దే
ఉదయం నుంచి నిఫ్టి 17700 బేస్‌గా కదులుతోంది. ఇక్కడి నుంచి ఏమాత్రం పెరిగినా మళ్ళీ క్షీణిస్తోంది. ఇక్కడి నుంచి తగ్గినా మళ్ళీ కోలుకుంటోంది. నిఫ్టి ఇవాళ 17655ని తాకింది. నిఫ్టి 37 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ సిమెంట్ షేర్లు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. ఐటీ షేర్లలో అమ్మకాలు గట్టిగానే ఉన్నాయి. ఇన్ఫోసిస్ ఇవాళ రెండు శాతంపైగా నష్టపోయింది. నిఫ్టి భారీగా పడినా.. మిడ్ క్యాప్ సూచీ మొత్తం నష్టాలను కవర్ చేసుకుంది. మిడ్ సెషన్లో మొదలైన యూరో మార్కెట్ల నష్టాలు ఒక శాతం దాకా ఉన్నాయి. యూరో స్టాక్స్ 50 సూచీ ఒకశాతంపైగా నష్టంతో ఉంది. యూరోను బట్టి మన మార్కెట్లు క్లోజయ్యే అవకాశముంది. కాకపోతే ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా ఉంది.