స్వల్ప నష్టాలు తప్పలేదు
ఫెడ్ నిర్ణయం ముందు ఈక్విటీ మార్కెట్లన్నీ స్తబ్దుగా ఉన్నాయి. ఉదయం ఆసియా మార్కెట్ల నుంచి యూరో మార్కెట్లు స్వల్ప లాభాలకే పరిమితం అవుతున్నాయి. కొన్ని పరిమిత నష్టాలతో ముగిశాయి. ఉదయం 18,178 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నఫ్టి మిడ్ సెషన్ సయయంలో 18048 పాయింట్లను తాకింది. తరవాత కోలుకున్నా 18082 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 63 పాయింట్లు నష్టపోయింది. అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిసినా… నష్టాలు నామమాత్రమమే కావడం విశేషం. ఫెడ్ ఇవాళ రాత్రికి వడ్డీ రేట్లను పెంచనుంది. అర శాతం పెంచుతుందా లేదా 0.75 శాతం పెంచుతుందా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఉదయం ఒక మోస్తరు లాభాల్లో ఉన్న అమెరికా ఫ్యూచర్స్ కూడా … క్రమంగా ఆ లాభాలను కోల్పోయింది. దీంతో మన ఇన్వెస్టర్లు కూడా కొత్త పొజిషన్స్‌కు దూరంగా ఉన్నారు. నిఫ్టిలో 35 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టాప్ గెయినర్స్‌లో హిందాల్కో కొనసాగింది. ఇతర మెటల్స్‌కు మద్దతు లభించింది. చాలా వరకు ఫార్మా షేర్లు ఇవాళ లాభాల్లో ఉన్నాయి.