For Money

Business News

భారీ లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

అమెరికా స్టాక్‌ మార్కెట్‌ రాత్రి దూసుకెళ్ళింది. ముఖ్యంగా నాస్‌డాక్‌ పరుగులు చూస్తుంటే..ఇటీవలినష్టాలను పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాత్రి నాస్‌డాక్‌ ఏకంగా 3.4 శాతం లాభపడగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.9 శాతం లాభంతో ముగిసింది. గత కొన్ని రోజులుగా డల్‌గా ఉన్న డౌజోన్స్‌ కూడా రాత్రి ఒకశాతంపైగా లాబంతో ముగియడం విశేషం. ఇక ఆసియా మార్కెట్లలో మెజారిటీ మార్కెట్లకు ఇవాళ సెలవు. నిన్నటి నుంచి చైనాలో కొత్త ఏడాది సెలవులు ప్రారంభమయ్యాయి. ఇవాళ సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌, దక్షిణ కొరియా మార్కెట్లకు సెలవు. జపాన్‌ మార్కెట్‌ అరశాతం లాభంతో ఉంది. న్యూజిల్యాండ్‌ మార్కెట్‌ 0.9 శాతం లాభంతో ఉన్నా ఆస్ట్రేలియా 0.25 శాతం లాభంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి 140 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది.