For Money

Business News

NIFTY TODAY: లక్ష్మణ రేఖ 17211

ఇవాళ నిఫ్టి లాభాలతో ప్రారంభం కానుంది. ఎల్లుండి వీక్లీతో పాటు నెలవారీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉంది. కాబట్టి పుట్‌, కాల్‌ కాంట్రాక్ట్స్‌ కొనేటపుడు జాగ్రత్త. నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 17,086. ఇవాళ ఓపెనింగ్‌లోనే తొలి ప్రతిఘటన 17180.ఈ స్థాయిని దాటితే మరో ప్రతిఘటన 17211 వద్ద ఎదురు కానుంది. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 17180 వద్ద లేదా 17200 ప్రాంతంలో అమ్మొచ్చు. అయితే స్టాప్‌లాస్‌ మాత్రం 17210.ఈ స్థాయిపైన నిఫ్టికి ఇబ్బంది ఉండకపోవచ్చు. నిఫ్టి గనుక పడితే 17,010 వద్ద మద్దతు అందే అవకాశముంది. లేదంటే 16990 మద్దతు లభించవచ్చు. 16960 దిగువన నిఫ్టిపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. కాకపోతే ఇవాళ ఆ పరిస్థితి రాకపోవచ్చు.