16,600పైన ముగిసిన నిఫ్టి
ఉదయం టెక్నికల్ అనలిస్టులు వేసిన అంచనా ఇవాళ పక్కాగా పనిచేసింది. నిఫ్టిని దిగువ స్థాయిలో కొనుగోలు చేయమని 16,400 లేదా 16,350 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయమని చాలా మంది అనలిస్టులు సిఫారసు చేశారు. ఉదయం 16,443ని తాకిన నిఫ్టి… అక్కడి నుంచి కోలుకుని 16,646 పాయింట్ల వరకు అంటే రెండు వందల పాయింట్లు పెరిగింది. క్లోజింగ్‌లో 16,628 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 105 పాయింట్ల లాభంతో ముగిసింది. ఐటీ, ఎన్‌బీఎఫ్‌సీతో పాటు మిడ్ క్యాప్ ఐటీ షేర్లకు గట్టి మద్దతు లభించింది. రిలయన్స్ నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా ఎంపిక చేసిన షేర్లకు చివర్లో మద్దతు లభించింది. బ్యాంక్ నిఫ్టి స్థిరంగా ముగిసింది. నిఫ్టి 0.64 శాతం లాభంతో ముగియడానికి ప్రధాన కారణంగా ట్రేడింగ్ మొత్తం కేవలం ఎంపిక చేసిన నిఫ్టి షేర్లకే పరిమితం కావడం. నిఫ్టి నెక్ట్స్ కూడా అర శాతం పెరిగింది కాని.. నిఫ్టి మిడ్‌క్యాప్ నామమాత్రపు లాభంతో ముగిసింది. ఎల్ఐసీ షేర్‌పై ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. నిఫ్టి నిన్న రూ. 801కి చేరినా క్లోజింగ్ కల్లా రూ. 810.40కి చేరింది. కాని ఇవాళ రూ. 804కు పడి.. దాదాపు అంతే స్థాయి రూ. 804.95 వద్ద ముగిసింది. ఎల్ఐసీ అతి తక్కువ ధర వద్ద క్లోజ్ కావడం ఇదే మొదటిసారి.