For Money

Business News

లాభాల్లోకి వచ్చిన నిఫ్టి

దిగువ స్థాయిలో మద్దతు అందడంతో ఉదయం 17,070ని తాకిన నిఫ్టి మిడ్‌ సెషన్‌కల్లా లాభాల్లోకి వచ్చేసింది. దీనికి ప్రధాన కారణంగా అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో రావడమే. టెక్‌ సూచీ దాదాపు 0.9 శాతం పెరగడంతో మన మార్కెట్‌లో కొనుగోళ్ళ మద్దతు అందింది. అలాగే యూరో స్టాక్స్‌ 50 ఫ్యూచర్స్‌ కూడా లాభాల్లో వచ్చింది. దీంతో నిఫ్టి 17,327ని తాకింది. మరి నిఫ్టి ఇదే ట్రెండ్‌ కొనసాగిస్తుందా లేదా బలహీనపడుతుందా అనేది చూడాలి. ఎందుకంటే నిఫ్టి తొలి ప్రతిఘటన 17,338 వద్ద, రెండో ప్రతిఘటన 17,350పైన ఎదురు కానుంది. నిఫ్టి భారీ లాభాలతో ముగియాలంటే మాత్రం నిఫ్టి 17,380 దాటాలి.