హమ్మయ్య… లాభాల్లో ముగిసిన నిఫ్టి
యూరో మార్కెట్ల పుణ్యమా అని ఇవాళ నిఫ్టి కోలుకుంది. మిడ్ సెషన్ వరకు నష్టాల్లో ఉన్నా… యూరో మార్కెట్ల ప్రారంభం తరవాత కోలుకోవడం మొదలైంది. గత కొన్ని రోజుల నుంచి భారీ నష్టాల్లో ఉన్న యూరో మార్కెట్లు ఇవాళ ఆరంభంలో ఒక శాతంపైగా లాభంతో ప్రారంభమయ్యాయి. అంతకుముందు మిడ్ సెషన్లో ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 15,671 పాయింట్లను తాకిన నిఫ్టి క్రమంగా లాభపడుతూ 16,028 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 150 పాయింట్ల లాభంతో 16,013 పాయింట్ల వద్ద ముగిసింది. అన్ని సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా నిఫ్టి నెక్ట్స్ 1.5 శాతం లాభ పడగా, మిడ్ క్యాప్ నిఫ్టి 1.48 శాతం లాభపడిండి. బ్యాంక్ నిఫ్టి కూడా 0.87 శాతం లాభంతో ముగిసింది.