నష్టాల నుంచి కోలుకున్న నిఫ్టి
ఉదయం అర గంటలోనే ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 17285కి చేరిన నిఫ్టి తరవాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది. అక్కడి నుంచి లాభనష్టాలతో అటూ ఇటూ సాగినా… క్లోజింగ్ ముందు అంటే స్క్వేర్ ఆఫ్‌కు ముందు ఒక్కసారిగా 17,176కి పడిపోయింది. కాని స్క్వేర్ ఆఫ్ సమయంలో కోలుకుని 20 పాయింట్ల నష్టంతో 17,213 వద్ద ముగిసింది. నిఫ్టి ఇవాళ ఆల్గో లెవల్స్‌కు అనుగుణంగా కదలాడింది.చాలా వరకు రెండో ప్రతిఘటన స్థాయి నుంచి కింది వచ్చి… రెండో మద్దతు స్థాయి నుంచి కోలుకుంది. బ్యాంకులు బలహీనంగా ఉండటమే ప్రధాన కారణం. బ్యాంక్ నిఫ్టి కీలక మద్దతు స్థాయి 35,000 దిగువకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నట్లు కన్పిస్తోంది. మిడ్ క్యాప్ సూచీ మాత్రం నామమాత్రమైనా…గ్రీన్‌లో ముగిసింది. ఇవాళ ఆటో, ఫార్మా షేర్లు వెలుగులో ఉన్నాయి. మిడ్‌క్యాప్‌లో ఐడియా మళ్ళీ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఐఆర్సీటీసీ ఇవాళ టాప్ లూజర్ కావడం విశేషం.