For Money

Business News

నిఫ్టి…100 పాయింట్లు నష్టపోయినా..

స్టాక్‌ మార్కెట్‌ బలహీనంగా ప్రారంభమైంది. నిఫ్టి ఓపెనింగ్‌లో 17578ని తాకిని కొన్ని సెకన్లలోనే 17520ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 95 పాయింట్లకు పైగా నష్టపోయింది. కాని కొన్ని నిమిషాల్లోనే కోలుకుని 17,586 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి ప్రస్తుతం 30 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఫలితాలు ప్రకటించిన రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి మార్కెట్‌కు పెద్దగా మద్దతు లభించలేదు. నష్టాలతో ప్రారంభమైన రిలయన్స్‌ ఇపుడు ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫలితాలు అద్భుతంగా ఉన్నా మార్కెట్‌ పెద్దగా స్పందించలేదు. ప్రస్తుతం ఈ షేర్‌ 0.83 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి కోలుకున్నట్లే ఇతర సూచీలు కూడా కోలుకున్నాయి. బ్యాంక్‌ నిఫ్టి నష్టాల నుంచి ఇప్పటికే గ్రీన్‌లోకి వచ్చేసింది. మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా నష్టాల నుంచి గ్రీన్‌లోకి వచ్చే అవకాశం కన్పిస్తోంది. మరి నిఫ్టి ఇదే స్థాయిలో కొనసాగుతుందా మిడ్‌ సెషన్‌లోగా మరోసారి క్షీణిస్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే అమెరికా ఫ్యూచర్స్‌ ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి.