చివర్లో కోలుకున్న నిఫ్టి
మిడ్ సెషన్లో బలహీనంగా మారిన నిఫ్టి క్లోజింగ్ కల్లా కోలుకుంది. ఒకదశలో 17,864కు పడిన నిఫ్టి క్లోజింగ్‌లో 18000 స్థాయిని దాటింది. క్రితం ముగింపుతో పోలిస్తే 46 పాయింట్ల లాభంతో 17991 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు అన్ని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. మిడ్ సెషన్లో ఓపెనైనా యూరో మార్కెట్లు నష్టాల్లో ఉన్నా.. మన మార్కెట్లు కోలుకుని లాభాల్లోముగిశాయి. మిడ్ క్యాప్ సూచీ కూడా 0.85 శాతం లాభపడింది. టైటాన్ ఇవాళ మళ్ళీ నిఫ్టిలో టాప్ గెయినర్‌గా నిలిచింది. ఐటీ కంపెనీల్లో ఇవాళ కూడా ఒత్తిడి కొనసాగింది.