భారీ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి
దాదాపు సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 15,762 స్థాయిని తాకి ఇపుడు 15,755 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 123 పాయింట్ల లాభం ఉంది. బ్యాంక్ నిఫ్టి ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 42 షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిన్న దారుణమైన ఫలితాలు ప్రకటించినా… భవిష్యత్తు బాగుంటుందని ప్రమోటర్లు ఇచ్చిన హామిని ఇన్వెస్టర్లు నమ్మినట్లు కన్పిస్తోంది. కరోనా కేసుల క్షీణించినందున… బిజినెస్ పెరుగుతుందని భావిస్తున్నారు. బజాజ్ ట్విన్స్ 2 శాతంపైగా లాభంతో ఉన్నాయి. నష్టాల్లో కొన్ని షేర్లు ఉన్నా… నామ మాత్రపు లాభాలతో ట్రేడవుతున్నాయి. ఈ కౌంటర్లలో కూడా లాభాల స్వీకరణ కారణంగా తగ్గాయి. ఇక నిఫ్టి విషయానికొస్తే నిఫ్టి 15,760 దాటితే 20 పాయింట్ల స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. మిడ్ సెషన్లో స్వల్ప కరెక్షన్కు ఛాన్స్ ఉంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
బజాజ్ ఫైనాన్స్ 6,145.00 3.42
విప్రో 584.00 2.80
బజాజ్ ఫిన్ సర్వీసెస్ 12,887.30 2.30
హిందాల్కో 390.80 2.04
ఓఎన్జీసీ 114.80 1.95
నిఫ్టి టాప్ లూజర్స్
ఏషియన్ పెయింట్స్ 3,128.80 -0.96
పవర్‌గ్రిడ్ 229.80 -0.65
సిప్లా 950.40 -0.50
బ్రిటానియా 3,423.65 -0.29
బజాజ్ ఆటో 3,894.15 -0.29