For Money

Business News

భారీ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి

గిఫ్టి నిఫ్టి సంకేతాలకు అనుగుణంగా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 21550ని దాటింది. క్రితం ముగింపుతో పోలిస్తే 90 పాయింట్ల లాభంతో 21544 వద్ద నిఫ్టి ఇపుడు ట్రేడవుతోంది. దాదాపు అన్ని ప్రధాన సూచీలు లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టితో పాటు మిడ్‌ క్యాప్‌ నిఫ్టి కూడా అర శాతం పైగా లాభంతో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌ కూడా 0.7 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో కేవలం అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఒక్కటే స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఏయూ బ్యాంక్‌, అరబిందో ఫార్మా టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. నిఫ్టి నెక్ట్స్‌లో ఇవాళ వీబీఎల్‌ ఏకంగా 15 శాతం లాభంతో ప్రారంభమైంది.