For Money

Business News

నిఫ్టి: ఆరంభంలోనే నష్టాలు

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా మార్కెట్‌ డల్‌గా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17,377 నుంచి నష్టాల్లోకి జారుకుంది. నిఫ్టి ప్రస్తుతం 17,351 పాయింట్ల వద్ద 11 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఐటీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దాదాపు ప్రధాన షేర్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. బ్రోకరేజీ రిపోర్ట్ కారణంగా ఐషర్‌ మోటార్‌ పడింది. బ్యాంక్‌ నిఫ్టిలో పెద్దగా ఒత్తిడి లేకపోవడంతో నిఫ్టి స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. నిఫ్టి 17,324ని తాకింది. 17,300 దిగువకు వస్తుందేమో చూడాలి. నిఫ్టి బలహీనంగా ఉంటే 17,260 ప్రాంతానికి వెళ్ళే అవకాశముంది. ఈ స్థాయిలో కొనుగోలు చేస్తారా లేదా వెయిట్‌ చేస్తారా అన్నది మీ రిస్క్‌ ప్రొఫైల్‌ను బట్టి ఉంటుంది. బ్యాంక్‌ నిఫ్టి నుంచి మద్దతు అందితే నిఫ్టి కోలుకునే ఛాన్స్‌ అవకాశాలు ఉన్నాయి. అయితే నిఫ్టి ఓవర్‌బాట్‌ పొజిషన్‌లో ఉంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,017.10 1.58
భారతీ ఎయిర్‌టెల్‌ 675.85 0.79 హిందుస్థాన్‌ లీవర్‌ 2,796.65 0.68
ఓఎన్‌జీసీ 118.85 0.64
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 737.85 0.49

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఐషర్‌ మోటార్స్‌ 2,792.30 -1.09 ఇన్ఫోసిస్‌ 1,689.90 -0.98
విప్రో 668.90 -0.79 టాటా మోటార్స్‌ 292.60 -0.68
మారుతీ 6,831.70 -0.66