For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మండి…

నిన్న ఆల్గో ట్రేడింగ్‌ పక్కాగా పనిచేసింది. ఇవాళ కూడా నిఫ్టి నిన్నటి ప్యాటర్న్‌ను కొనసాగించే అవకాశముంది. నిన్న విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఇన్వెస్టర్లు కూడా అమ్మారు. అయితే చాలా స్వల్ప మొత్తమే. అంతర్జాతీయ మార్కెట్లు నీరసంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభమైన వెంటనే ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 17,362. సింగపూర్ నిఫ్టి 40 పాయింట్లు గ్రీన్‌లో ఉంది. ఈ లెక్కన నిఫ్టి 17400 పాయింట్లపైన ప్రారంభమయ్యే అవకాశముంది. నిన్నటి గరిష్ఠ స్థాయి ఇవాళ కూడా ప్రతిఘటన స్థాయిగా మారనుంది. నిఫ్టి 17440-17450 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మవచ్చని టెక్నినల్‌ అనలిస్టలు సలహా ఇస్తున్నారు. నిఫ్టికి 17460ని దాటితే బ్రేకౌట్‌ రావొచ్చు. కాబట్టి… ఈ స్థాయి తరవాత అమ్మకాలకు పాల్పడవద్దు. రేపు వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌, ఎల్లుండి మార్కెట్లకు సెలవు. కాబట్టి ఇవాళ నిఫ్టిలో పెద్ద హెచ్చుతగ్గులు అనుమానమే. నిఫ్టికి నిన్నటి ముగింపు చాలా కీలకం. ఈ స్థాయి పైన ఉన్నంత వరకు నిఫ్టి పరవాలేదు. ఈ స్థాయి దిగువకు వస్తే నేరుగా 17300 దాకా వెళ్ళే అవకాశముంది. దిగువ స్థాయిలో కూడా కొనుగోళ్ళ మద్దతు అందవచ్చు. సో 17280 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. నిన్నటి మాదిరి రెండువైపులా ట్రేడింగ్‌ ఛాన్స్‌ ఉంటుందా అన్నది అనుమానమే. అధిక స్థాయిలో అమ్మడానికి ప్రయత్నం చేయండి.