నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17219ని తాకిన నిఫ్టి ఇపుడు రూ.17,273 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 31 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నా … నష్టాలు నామ మాత్రమే. సూచీల కన్నా షేర్ల ప్రధానంగా ట్రేడింగ్ జరుగుతోంది. ముఖ్యంగా సిమెంట్ షేర్లలో ఒత్తిడి బాగా ఉంది. అలాగే ఐటీ షేర్లలో కూడా. నెస్లే ఫలితాలు ఒక మోస్తరుగా ఉండటంతో షేర్ ధర ఒక శాతంపైగా నష్టపోయింది. అదానీ గ్రీన్ ఇవాళ కూడా రెండు శాతంపైగా లాభంతో ఉంది. అంబుజా సిమెంట్ 4 శాతం నష్టపోయింది. నిఫ్టి మిడ్ సెషన్ తరవాత తీవ్రంగా రియాక్ట్ అయ్యే అవకాశముంది.