నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి
నిఫ్టి తొలి మద్దతు స్థాయి వద్దే కోలుకుంది. నష్టాలతో ప్రారంభమైన వెంటనే దిగువ స్థాయికి చేరుకుంది. ఓపెనింగ్‌లో 17,496కి చేరిన నిఫ్టి వెంటనే 17434ని తాకింది ఇపుడు 17,474 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 43 పాయింట్లు లాభపడింది. నిఫ్టి 31 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టి నష్టాల్లో ఉండగా.. మిడ్‌క్యాప్ నిఫ్టి లాభాల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. నిన్న టాప్ గెయినర్‌గా ఉన్న ఐటీసీ, ఇవాళ కూడా లాభాల్లో ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టిలో ఐడియా వరుసగా మూడో రోజు టాప్ గెయినర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ షేర్ రూ. 16.65 వద్ద ట్రేడవుతోంది.