15900 పైన ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి కన్నా కాస్త మెరుగ్గా నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 15900 స్థాయిని దాటి 15943ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే ప్రస్తుతం 91 పాయింట్ల లాభంతో 15941 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అన్ని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్ 0.84 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇతర సూచీలన్నీ అర శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో 41 షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇవాళ మెటల్స్ గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి షేర్లలో హిందాల్కో టాప్ గెయినర్‌గా ఉంది. ఇక నష్టాల్లో ఎన్టీపీసీ టాప్ లూజర్‌గా ఉంది. నిఫ్టి నెక్ట్స్ వేదాంత టాప్ గెయినర్‌గా ఉంది. నిఫ్టి బ్యాంక్‌లో ఇవాళ కూడా బంధన్ బ్యాంక్ టాప్ గెయినర్‌గా ఉంది.