For Money

Business News

NIFTY TRADE : LIC లిస్టింగ్‌ చూడండి

అధిక స్థాయిలో నిఫ్టిని షార్ట్‌ చేయమని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ సలహా ఇస్తున్నారు. ఓపెనింగ్‌లో చేయొద్దన్నారు. ఎల్‌ఐసీ లిస్టింగ్‌ నిరాశాజనకంగా ఉండి… నిఫ్టి గనుక మూడు రోజలు కనిష్ఠ స్థాయిని కోల్పోతే కూడా 15,500 లేదా 15400 పుట్స్‌ కొనుగోలు చేయొచ్చని అన్నారు. నిఫ్టి 16000 లేదా 16100 దాటితేనే మార్కెట్‌లో రిలీఫ్‌ ర్యాలీ వస్తుందన్నారు. నిఫ్టి పెరిగితే 15923, 15984 స్థాయిల వద్ద ప్రతిఘటన వస్తుందన్నారు. ఈ స్థాయిలు దాటితే 16066 లేదా 16110ని తాకే అవకాశముందన్నారు. పడితే నిఫ్టికి 15784 లేదా 15734 వద్ద మద్దతు అందే అవకాశముంది. లేదంటే 15660 లేదా 15574ని తాకే అవకాశముందని అంటున్నారు.