స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఆరంభంలో 16629ని తాకినా.. కొన్ని నిమిషాల్లోనే 16686ని తాకింది. ఇపుడు 55 పాయింట్ల లాభంతో 16684 వద్ద ట్రేడవుతోంది. ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేయడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇవాళ రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి కన్నా బ్యాంక్ నిఫ్టి భారీ లాభాల్లో ఉండటానికి ప్రధాన కారణం – హెచ్డీఎఫ్సీ బ్యాంక్. కొన్ని ఐటీ షేర్లు కూడా గ్రీన్లో ఉన్నాయి. అన్ని సూచీలు గ్రీన్లో ఉన్నాయి. అయితే మిడ్ క్యాప్, బ్యాంక్ నిఫ్టి ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. ఆటో షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. అలాగే కొన్ని మెటల్ కౌంటర్స్లో కూడా.