For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17,739ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 17,734 వద్ద 23 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నా నిఫ్టి బ్యాంక్, ఫైనాన్షియల్‌ సూచీలు నామ మాత్రపు లాభాల్లో ఉన్నాయి. ఏ క్షణమైనా ఈ సూచీలు నష్టాల్లోకి వెళ్ళొచ్చు. మిడ్‌ క్యాప్‌ సూచీ మాత్రం అర శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. ప్రధాన షేర్లలో పెద్ద మార్పుల్లేవ్‌. నిఫ్టిలో 29 షేర్లు గ్రీన్‌లో ఉండగా, 20 షేర్లు నష్టాల్లో ఉన్నాయి.