స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17,353 పాయింట్లకు చేరింది. ప్రస్తుతం 16 పాయింట్ల నష్టంతో 17,337 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి 29 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు డల్‌గా ఉన్నాయి. సో.. ఈ స్థాయిలో నో ట్రేడ్. నిఫ్టి పెరిగితేనే అమ్మండి. లేదంటే నో ట్రేడ్. నిఫ్టి 17,330 పైన ఉన్నంత వరకు నిఫ్టి బలంగా ఉన్నట్లే. పడితే కూడా 17300 ప్రాంతంలోనే మద్దతు అందితే డే ట్రేడర్స్‌కు దక్కేదేమీ ఉండదు. కాబట్టి నిఫ్టి భారీగా పెరిగినపుడే అమ్మండి. షేర్లలో కూడా పెద్ద మూవ్మెంట్ లేదు. కొటక్ బ్యాంక్ గత కొన్ని రోజులుగా యాక్టివ్‌గా ఉంది. వినాయక చవితి సందర్భంగా రేపు మార్కెట్లకు సెలవు. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌కు క్లోజింగ్.
నిఫ్టి టాప్ గెయినర్స్
కొటక్ బ్యాంక్ 1,832.00 0.92
హిందాల్కో 460.00 0.81
భారతీ ఎయిర్టెల్ 673.15 0.79
టాటా మోటార్స్ 297.40 0.73
నెస్లే ఇండియా 19,946.00
నిఫ్టి టాప్ లూజర్స్
ఎస్బీఐ లైఫ్ 1,185.50 -2.83
యూపీఎల్ 756.35 -0.74
టెక్ మహీంద్రా 1,417.35 -0.74
విప్రో 657.40 -0.72
ఎం అండ్ ఎం 749.50 -0.70