For Money

Business News

నిఫ్టి: నిమిషాల్లో నష్టాలోకి…

నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17,425 స్థాయిని తాకింది. కొన్ని నిమిషాల్లోనే 17,349ని తాకింది. నిఫ్టి ప్రస్తుతం 19 పాయింట్ల నష్టంతో 17,359 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టితో పాటు మిడ్‌ క్యాప్‌, బ్యాంక్‌ నిఫ్టి సూచీలు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టిలో 32 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మరి నిఫ్టికి 17300 ప్రాంతంలో మద్దతు లభిస్తుందేమో చూడాలి. నిఫ్టి భారీగా పడిన తరవాతే కొనుగోలు చేయమని మార్కెట్‌ విశ్లేషకుడు సుదర్శన్‌ సుఖాని సీఎన్‌బీసీ టీవీ18 ప్రేక్షకులకు సలహా ఇచ్చారు. తొందరపడి కొనవద్దని ఆయన అంటున్నారు. మిడ్‌ సెషన్‌లోపలే నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠస్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయని ఇన్వెస్టర్లు అంటున్నారు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఏషియన్‌ పెయింట్స్‌ 3,392.00 2.31
ఐటీసీ 211.90 1.24
టాటా కన్జూమర్‌ 878.00 0.91
జేఎస్‌డబ్ల్యు స్టీల్‌ 692.65 0.87
టాటా స్టీల్‌ 1,449.30 0.86

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
విప్రో 679.05 -1.08
యాక్సిస్‌ బ్యాంక్‌ 792.40 -1.05
సన్‌ ఫార్మా 776.50 -0.99
ఇన్ఫోసిస్‌ 1,716.20 -0.82
డాక్టర్‌ రెడ్డీస్‌ 4,880.15 -0.73