స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
గిఫ్ట్ నిఫ్టి సూచించిన స్థాయిలోనే నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. 21477 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి వెంటనే 21418ని తాకింది. ఇపుడు 8 పాయింట్ల లాభంతో 21426 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… డౌజోన్స్ జీరో లాభాలో ముగిసింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో అమెరికా ప్రాభావిత మార్కెట్లు గ్రీన్‌లో ఉండగా… చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. తగ్గినట్లే తగ్గిన క్రూడ్ మళ్ళీ 78 డాలర్లను దాటింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్ల సూచీలు గ్రీన్‌లో ఉన్నా… బ్యాంకుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఇటీవల భారీగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. టీసీఎస్‌తో పాటు ఐటీ షేర్లలో ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. నిఫ్టిలో కోల్ ఇండియా టాప్ గెయినర్‌గా నిలిచింది. సోనీతో జీ ఎంటర్టైన్మెంట్ డీల్ రద్దు అయ్యే అవకాశముందని వార్తలు రావడంతో ఆ షేర్లో అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. ఓపెనింగ్‌లోనే రూ. 271కు పడిన ఈ షేర్ ఇపుడు 3 శాతం నష్టంతో రూ. 272 వద్ద ట్రేడవుతోంది. దేవ్యాని ఇంటర్నేషనల్ షేర్ 7 శాతం లాభంతో ట్రేడవుతోంది.