For Money

Business News

జీ-సోనీ డీల్‌ కుప్పకూలనుందా?

వివాదాస్పద జీ గ్రూప్‌కు మరో షాక్‌ తప్పేలా లేదు. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కోసం పట్టుబడుతున్న జీ గ్రూప్‌ అధినేత వైఖరితో ఈ డీల్‌ ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. నిర్ణీత గడువులోపు విలీనం పూర్తి కాకపోవడంతో… విలీన గడువు తేదీని పొడగించాలని కోరుతూ జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఏజీఎం ఇటీవల సోనిని కోరింది. అయితే సోని పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రం ఈ డీల్‌ నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విలీన గడువును పొడిగించరాదని కంపెనీ భావిస్తున్నట్లు మింట్‌ లైవ్‌ పత్రిక పేర్కొంది. 1000 కోట్ల డాలర్ల ఈ డీల్‌ కోసం ఇన్వెస్టర్లు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.