నిలకడగా ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18090ని తాకిన నిఫ్టి కాస్సేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇపుడు 27 పాయింట్ల లాభంతో 18080 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకు షేర్లు స్థిరంగా ఉండగా, మిడ్‌క్యాప్ షేర్లు వెలుగులో ఉన్నాయి. నిఫ్టినెక్ట్స్ సూచీలో పెద్ద మార్పు లేదు. నిఫ్టిలో ఎస్బీఐ లైఫ్ షేర్ ఒకటిన్నర శాతం లాభంతో ఉండగా… హెచ్‌డీఎఫ్‌సీలైఫ్ అరశాతం పైగా నష్టంతో ట్రేడవుతోంది. ఇవాళ కూడా మెటల్, ఐటీ షేర్లకు మద్దతు లభిస్తోంది. నైకా ఇవాళ మరో మూడుశాతం క్షీణించి రూ. 130 దిగువకు వచ్చేసింది. బ్యాంకు షేర్ల విషయానికొస్తే నిన్న భారీగా క్షీణించిన ఎస్బీఐ షేర్ ఇవాళ అర శాతంపైగా లాభపడింది.