For Money

Business News

స్థిరంగా నిఫ్టి

మార్కెట్‌ దాదాపు క్రితం ముగింపు వద్ద ట్రేడవుతోంది. ఓపెనింగ్‌లోనే 18191ని తాకిన నిఫ్టి కొద్దిసేపటికే 18152 పాయింట్లను తాకింది. ఇపుడు 4 పాయింట్ల లాభంతో 18164 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి నెక్ట్స్‌ నష్టాల్లో ఉండగా నిఫ్టి మిడ్‌ క్యాప్‌, నిఫ్టి బ్యాంక్‌ గ్రీన్‌లో ఉంది. అయితే హెచ్చుతగ్గులు చాలా స్వల్పంగా ఉన్నాయి. నిఫ్టిలో 28 షేర్లు గ్రీన్‌లో ఉండగా, 21 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ బ్లాక్‌ డీల్‌ కారణంగా నైకా షేర్‌ రెండున్నర శాతం నష్టంతో 179 వద్ద ట్రేడవుతోంది. అలాగే పేటీఎం కూడా రెండు శాతంపైగా నష్టపోయింది. బ్యాంకు షేర్లలో కూడా పెద్ద మార్పులు లేవు. ఎన్‌డీటీవీ ఓపెన్‌ ఆఫర్‌ ఇవాళ ప్రారంభమైంది. నిన్న అయిదు శాతం క్షీణించిన ఎన్‌డీటీవీ షేర్‌ ఇవాళ మరో 5 శాతం క్షీణించి రూ. 362 వద్ద ట్రేడవుతోంది. స్థానిక షేర్లలో రెయిన్‌ బో హాస్పిటల్‌ షేర్‌ కేవలం అయిదు రోజుల్లో రూ.100పైగా క్షీణించింది. ఈనెల 16న ఈ షేర్‌ రూ.886ని తాకగా, ఇవాళ రూ. 781ని తాకింది.