స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
పోలెండ్ మిస్సయిల్స్ ప్రయోగించిందన్న వార్తలతో సింగపూర్ నిఫ్టి ఉదయం వంద పాయింట్ల వరకు క్షీణించింది. తరవాత కోలుకుని ఇపుడ స్వల్ప నష్టంతో ఉంది. నిఫ్టి కూడా దాదాపు అదే స్థాయిలో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 18417 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 18380 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 23 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలదీ అదే పరిస్థితి. న్యూస్ ప్రధాన షేర్లలో కదలికలు మినహా… అన్నీ క్రితం ముగింపు వద్దే ఉన్నాయి. కోల్ ఇండియా ఒక శాతం లాభంతో ఉంది. ఇటీవల బాగా పెరిగిన మెటల్స్ వంటి షేర్లలో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. నిన్న 10 శాతం దాకా క్షీణించిన నైకా షేర్ ఇవాళ కూడా 7 శాతం క్షీణించి రూ.179 వద్ద ట్రేడవుతోంది. పే టీఎం కూడా రెండు శాతంపైగా తగ్గింది. మిగతా షేర్లలో పెద్ద మార్పు లేదు. దివీస్ల్యాబ్లో ఇవాళ మళ్ళీ ఒత్తిడి కన్పిస్తోంది. ఇపుడు ఈ షేర్ రూ. 36 నష్టంతో ట్రేడవుతోంది.