For Money

Business News

స్థిరంగా నిఫ్టి ప్రారంభం

మార్కెట్‌ క్రితం ముగింపు వద్దే ప్రారంభమైంది. ఫెడ్‌ నిర్ణయం కోసం ప్రపంచ మార్కెట్లు ఎదురు చూస్తున్నారు. ఆసియా మార్కెట్లలో పెద్దగా మార్పు లేదు. ఇవాళ నిఫ్టి 18,141 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 4 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్‌ నిఫ్టి గ్రీన్‌లో ఉంది. నిఫ్టి మిడ్‌క్యాప్‌ కూడా. అయితే ఈ మార్పులు అన్నీ నామమాత్రమే. మెటల్స్‌ మళ్ళీ మెరుస్తున్నాయి. హిందాల్కో టాప్‌ గెయినర్‌గా ఉంది. అలాగే టాటా స్టీల్‌ కూడా. హీరో మోటోకార్ప్‌, భారతీ ఎయిర్‌ టెల్‌ షేర్లు ఇవాళ కూడా ఒక శాతం పైగా నష్టంతో ఉన్నాయి. ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో రెండో రోజు అమ్మకాలు సాగుతున్నాయి. చాలా షేర్లు ఫలితాలకు రియాక్ట్‌ అవుతున్నాయి. మార్కెట్‌లో పొజిషన్‌ తీసుకునేవారు మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 మధ్య మార్కెట్‌ ట్రెండ్‌ను చూసి తీసుకోవచ్చు. అయితే రేపు మార్కెట్‌ భారీ లాభం లేదా నష్టంతో ప్రారంభం కావొచ్చు. కాబట్టి పొజిషన్‌ తీసుకునే ముందు జాగ్రత్త. ఎందుకంటే స్టాప్‌లాస్‌ పెట్టుకునే ఛాన్స్‌ ఉండదు.