స్థిరంగా ప్రారంభం
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే స్వల్ప నష్టంతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 17924ని తాకిన నిఫ్టి ఇపుడు 17913 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 30 పాయింట్ల నష్టంతో ఉంది. ఇతర ప్రధాన సూచీలు కూడా స్థిరంగా ఉన్నాయి. ఇక షేర్ల విషయానికొస్తే హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇవాళ కూడా నిఫ్టిలో టాప్ గెయినర్‌గా నిలిచింది. వరుసగా మూడోరోజు ఈ స్క్రిప్ గ్రీన్‌లో ఉంది. నిఫ్టి గెయిన్స్ లాభాలన్నీ ఒక శాతం లోపే ఉన్నాయి. ఇక నష్టాల్లో డాక్టర్ రెడ్డీస్ నాలుగు శాతంపైగా నష్టంతో నిఫ్టి లూజర్స్‌లో టాప్‌లో ఉంది. సన్ ఫార్మా కూడా 2.6 శాతం నష్టంతో ఉంది. ఇక బజాజ్ ట్విన్స్ ఇవాళ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. బజాజ్ హోల్డింగ్స్ 2.5 శాతంపైగా లాభంతో ఉంది. డి మార్ట్, జొమాటొ గ్రీన్‌లో ఉన్నా లాభాలు ఒక శాతం ప్రాంతంలో ఉన్నాయి. ఇక హైదరాబాద్‌కు చెందిన లారస్ ల్యాబ్‌లో అప్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. కంపెనీ షేర్ ఇవాళ కూడా ఒకటిన్నర శాతం పెరిగి రూ. 600లకు చేరింది. అరబిందో ఫార్మా రెండు శాతంపైగా నష్టంతో ఉంది.